“రాజా సాబ్” సీక్వెల్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాజా సాబ్ ను నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విశ్వప్రసాద్ చెప్పిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూస్ లో రాజాసాబ్ సీక్వెల్ ఉంటుందని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. రాజా సాబ్ కథకు కొనసాగింపుగా ఉండదని, కొత్త … Read more

అనుష్క తగలబెట్టేసింది

అనుష్క లీడ్ రోల్స్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసింది. ఇప్పుడామె చేస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఘాటి. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అనుష్క మొత్తం తగలబెట్టేసింది. మాస్ యాక్షన్ రోల్ లో ఆమె పీక్స్ పర్ ఫార్మెన్స్ చూపించింది. బ్రిటిష్ కాలంలో ప్రమాదకరమైన కొండప్రాంతాల్లో రోడ్లు నిర్మించిన ఘాటి తెగ..కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో … Read more

సినీ కార్మికులతో చర్చలు ఫలించేనా?

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రమవుతోంది. నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా, కార్మిక యూనియన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో షూటింగ్స్ సాధ్యం కావడం లేదు. సీరియల్స్ షూటింగ్స్ కూడా సినీ కార్మిక యూనియన్స్ అడ్డుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలతో ప్రొడ్యూసర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. ఈ రోజు ఫిలింఛాంబర్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో సినీ కార్మిక … Read more

లీగల్ గేమింగ్ యాప్స్ కే ప్రచారం చేశా – విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ విచారణలో భాగంగా ఈ రోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఈడీ అధికారులు అడిగిన వివరాలు అందించారు. తాను ప్రచారం చేసింది బెట్టింగ్ యాప్స్ కు కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లీగల్ గేమింగ్ యాప్స్ కు అని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – బెట్టింగ్ యాప్స్ లో నేను విచారణకు … Read more

“K- ర్యాంప్” ఓనమ్ సాంగ్ వచ్చేస్తోంది

కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఓనమ్ సాంగ్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను కేరళ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఓనమ్ నేపథ్యంగా రూపొందించారు. ఓనమ్ సాంగ్ తో ఫెస్టివల్ వైబ్ తీసుకురానున్నారు ” K-ర్యాంప్” టీమ్. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ హిట్ ట్యూన్ అందించారు. ఫుల్ ఎనర్జిటిక్ గా ఓనమ్ సాంగ్ ఉండబోతోంది. “K-ర్యాంప్” సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ … Read more

తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడిన “కింగ్డమ్”

గ్యాప్ తర్వాత కింగ్డమ్ తో మంచి సక్సెస్ కొట్టాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సక్సెస్ లో చిన్న ట్విస్ట్ యాడ్ అయ్యింది. కింగ్డమ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నా, కలెక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ కావడం లేదు. ఇందుకు కారణం ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తున్నాయి. కింగ్డమ్ రిలీజ్ కు ముందు పవన్ హరి హర వీరమల్లు మంచి వసూళ్లు సాధించగా.. ఇప్పుడు మహావతార్ నరసింహా ఘన విజయాన్ని అందుకుంటోంది. ఈ సినిమా … Read more

నన్ను తిడితే వాళ్లే సమాధానం చెబుతారు – చిరంజీవి

తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, తను చేసే మంచి పని ద్వారానే వారికి సమాధానం చెబుతానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు ఆయన అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈసారి ఇండిపెండెన్స్ డేను ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త, హీరో తేజ సజ్జ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ఆ … Read more

“డేవిడ్ రెడ్డి”గా వస్తున్న మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమాను దర్శకుడు హనుమ రెడ్డి యెక్కంటి రూపొందించనున్నారు. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంతో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ 21 ఏళ్లుగా తన కెరీర్ కొనసాగుతోందని, ఇన్నేళ్లుగా తనకు నచ్చిన ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగడం … Read more

“విశ్వంభర” రిలీజ్ పై క్లారిటీ?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఆ నెలంతా పెద్ద సంఖ్యలో రిలీజ్ లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ కూడా అదే నెలలో రిలీజ్ కు వస్తోంది. దీంతో విశ్వంభర రిలీజ్ ను మరో నెల ఆలస్యంగా అక్టోబర్ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మెగా 157 రిలీజ్ కు రెడీ అవుతోంది. సో అక్టోబర్ కంటే … Read more

రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పడం..ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకోవడం ఫిక్స్ అయ్యిందట. మరోవైపు నాగచైతన్య..డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా … Read more