“ఘాటీ” ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క

అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటీ. ఈ మూవీని క్రిష్ తెరకెక్కించారు. అనుష్క, క్రిష్‌.. వీరిద్దరి కాంబోలో వేదం సినిమా రూపొందడం.. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ఆతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ఘాటీ సినిమా రూపొందింది. ఇందులో అనుష్కను ఇప్పటి వరకు చూపించని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించడం విశేషం. సెప్టెంబర్ 5న ఘాటీ సినిమా రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు. ఇటీవలే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అనుష్క మాత్రం ఇంత … Read more

“ఎల్లమ్మ”లో శర్వానంద్

బలగం సినిమాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వేణు. ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయాలి అనుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఎల్లమ్మ కథ ముందుగా నాని ఆ తర్వాత విశ్వక్ సేన్, ఆ తర్వాత నితిన్ దగ్గరకు వెళ్లింది. నితిన్ తో ఎలమ్మ మూవీ కన్ఫర్మ్ అనే అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోగా నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి … Read more

రెండు డిఫరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలో చరణ్‌ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పెద్దిలో చరణ్‌ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఆల్రెడీ ఈ మూవీ గ్లింప్స్ లో ఒక … Read more

“లక్ష్మీ” కాంబో సెట్ అయ్యిందా..?

హీరో వెంకటేష్, దర్శకుడు వీవీ వినాయక్ కలిసి లక్ష్మీ అనే సూపర్ హిట్ మూవీ చేశారు. ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ వీరి కాంబోలో చివరిదాకా వచ్చి మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడీ కాంబో తిరిగి సెట్ అయినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని వెంకటేష్ తో తీసేందుకు వినాయక్ రెడీ అవుతున్నారట. త్వరలో ఈ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ … Read more

ప్లెజెంట్ డ్యూయెట్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను థమన్ క్లాస్ గా కంపోజ్ చేశారు. శృతి రంజన్ అంతే క్లాస్ గా పాడారు. ఓజీ లాంటి ఫైర్ స్ట్రామ్ మూవీలో ఇంత క్లాస్ డ్యూయెట్ పెట్టడం కొత్త ప్రయత్నమే. పవన్ ఇలాంటి ప్లెజెంట్ డ్యూయెట్ లో చాలా రోజుల తర్వాత కనిపించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య … Read more

రజినీ డైరెక్టర్ తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. వశిష్ట్ డైరెక్షన్ లో విశ్వంభర నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న మన శంకర్ వరప్రసాద్ గారు రాబోతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు మెగాస్టార్. వీటితో పాటు ఇటీవల చిరు బర్త్ డేకు డైరెక్టర్ బాబీతో సినిమాను అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ నటించినట్టుగా ఇందులో కూడా మరో … Read more

ఎన్టీఆర్ పై “వార్ 2” ఎఫెక్ట్

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దాంతో దేవరకు ఓ మోస్తరు కలెక్షన్స్ దక్కాయి. వార్ 2 ఆఫర్ కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో వచ్చిందే. ఇందులో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటించారు. వార్ 2 సినిమా పై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకువస్తుందని బలంగా నమ్మాడు. ఎన్టీఆర్ సోలో హీరోగా హిందీ మూవీకి సన్నాహాలు జరిగాయి. అయితే వార్ 2 … Read more

ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా..!

మౌళి తనుజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “లిటిల్ హార్ట్స్” మూవీ నుంచి ఈరోజు చదువూ లేదు, సంధ్యా లేదు లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సగటు తెలుగు స్టూడెంట్ లైఫ్ ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. చదువుల్లో ఏ టాలెంట్ లేని కుర్రాళ్లు, బయట ఎలాంటి ఘనకార్యాలు చేస్తుంటారు అనేది చదువూ లేదు పాటలో హైలైట్ గా నిలుస్తోంది. ఈ పాటను సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా, … Read more

ఈసారి సూపర్ హిట్ ఇస్తాడట..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు అయిన షూటింగ్ రషెష్ చేసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈసారి సూపర్ హిట్ కొడుతున్నామని తన ఫ్రెండ్స్ కు చెబుతున్నాడట పూరి జగన్నాథ్. ఈ మూవీకి బెగ్గర్, భవతీ భిక్షాందేహీ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట. ఇందులో సీనియర్ నటి టబు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తోంది పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం … Read more

“సర్కార్ తో ఆట” విజేతలకు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ గిఫ్ట్

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5 లో ప్రేక్షుకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్ తో ఆట అనే కొత్త … Read more