BMW: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు వంద రూపాయలు దాటిపోయాయి. BMW

BMW i5 M60 Launched In India, Priced At Rs 1.20 Crore

దీంతో సామాన్యులు బైకు లేదా కారు నడపడం చాలా ఇబ్బందిగా మారిపోయింది అన్న సంగతి తెలిసిందే. ఈ కారణాల నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా మరో లగ్జరీ కార్ ఎలక్ట్రిక్ మోడల్ లో వచ్చేసింది. అదే బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు. బీఎండబ్ల్యూ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Also Read: Yamaha: చోరీ టెన్షన్ ఏ ఉండదు… యమహా స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు…!

జర్మనీ దేశానికి చెందిన ఈ బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ sedan i5 కారును లాంచ్ చేసింది. ఇక ఈ కారు ధరను 1.20 కోట్లుగా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 516 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 3.8 సెకండ్ల లోనే 100 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది.

ఇక గంటకు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ కారు. అలాగే 25 కిలో వాట్ల ఏసీ చార్జర్ ను ఇందులో అమర్చారు. అర్ధగంటలోనే 10 శాతం నుంచి 80% వరకు ఈ కారు చార్జింగ్ ఎక్కుతుంది. అంతేకాకుండా మనకు 360 డిగ్రీ కెమెరా అందిస్తున్నారు. అటు 14.9 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా రూపొందిస్తున్నారు.

Join WhatsApp