Yamaha : మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు అలానే కార్లు కూడా వస్తున్నాయి. చాలా మంది కొత్త కొత్త వెహికిల్స్ ని కొనుగోలు చెయ్యాలని చూస్తూ వుంటారు. యమహా కంపెనీ ఈమధ్య భారతదేశంలో Aerox 155 వెర్షన్ Sని తీసుకు రావడం జరిగింది. స్కూటర్ లైనప్‌లో ఇది నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ కొత్త వేరియంట్ యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారంలో భాగమైంది.

Yamaha scooter latest features

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్ళిపోదాం. ఈ కొత్త టు వీలర్ ధర రూ.1,50,600 గా వుంది. బ్లూ స్క్వేర్ షోరూమ్‌ లో ప్రత్యేకంగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. AEROX 155 వెర్షన్ S యొక్క ముఖ్య ఫీచర్ ఏమిటంటే స్మార్ట్ కీ టెక్నాలజీ తో దీన్ని రూపించారు. పట్టణ ప్రయాణాన్ని మెరుగుపరచడానికి దీనిని తీసుకుని వచ్చారు. సిస్టమ్ ఆన్సర్ బ్యాక్, అన్‌లాక్, ఇమ్మొబిలైజర్ ఇలాంటి ఫీచర్లు కొన్ని ఉన్నాయి. ఇది రైడర్‌లకు సౌలభ్యం అలానే భద్రత రెండింటినీ అందిస్తుంది.

Also read: Blaupunkt Xtreme Earbuds: 120 గంటలు వాడచ్చు.. ధర కూడా తక్కువే..!

ఆన్సర్ బ్యాంక్ ఫంక్షన్ ని కూడా ఇచ్చారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. వీడియో, ఆడియో సిగ్నల్‌లతో స్కూటర్‌ను గుర్తించడం లో హెల్ప్ చేస్తుంది. కీలెస్ ఇగ్నిషన్ స్మార్ట్ కీ సిస్టమ్ కూడా దీనికి ఇచ్చారు, కీ వాడకుండానే స్కూటర్‌ను మనం స్టార్ట్ చెయ్యవచ్చు. ఫంక్షన్, ఇమ్మొబిలైజర్ ఫంక్షన్‌తో పాటు, కీ దగ్గరగా లేనప్పుడు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తే స్కూటర్ చోరీ అవ్వకుండా చెయ్యచ్చు. స్మార్ట్ కీ సిస్టమ్‌ తో పాటుగా కొత్త Yamaha AEROX 155 వెర్షన్ S, X సెంటర్ మోటిఫ్ ద్వారా హైలైట్ అయిన అథ్లెటిక్ డిజైన్‌ను ఇచ్చారు (Yamaha).

Join WhatsApp