Have you noticed the watch on Nayanthara's hand?

Nayanthara: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరో మరియు హీరోయిన్స్ పెట్టుకున్న వాచెస్ మరియు ధరించిన బట్టల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఇలాంటిదే మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా మన లేడీ సూపర్ స్టార్ గురించి. లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Have you noticed the watch on Nayanthara’s hand?

జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన భర్త మరియు పిల్లలతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే చెన్నైలో డాక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్ను ఘనంగా నిర్వహించారు. తన భర్త విగ్నేష్ తో కలిసి నయనతార లిలక్ షెడ్ చీరలో అందంగా కనిపించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి ధ్యాస ఆమెపై తిప్పుకుంది.

Also Read: Heroine: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..!

ఎంతో సింపుల్గా అద్భుతంగా కనిపించిన ఈ జంట ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ కంటే ముందు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక ఇందులో ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని మళ్లించింది. ఆమె చీరకు సరిగ్గా సరిపోయే విలాసవంతమైన రోలెక్స్ ఓస్టెర్ పర్పెచ్యువల్ 36 ధరించింది. ఇది సోగసైన మన్నికైన వాచ్ లకు ప్రసిద్ధి. ఇక ఇది ఇతర మోడల్ ల నుంచి వేరుగా ఉంటుంది.

Have you noticed the watch on Nayanthara's hand?

నయనతార ధరించిన వాచ్ ఖరీదు దాదాపూ రూ. 5.3 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలో 2023లో నయనతార నటించిన అన్నపూర్ణ సినిమా ప్రీమియర్ సమయంలో రోలెక్స్ వాచ్ ధరించింది. ఇక ఈ వాచ్ ఖరీదు దాదాపు 5.5 లక్షలు. ఇక ఈ పిక్స్ లో నయన్ ధరించిన వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Nayanthara)

Join WhatsApp