The star Heroine who is about to get a divorce

Heroine: ఈ మధ్యకాలంలో నటీనటుల విడాకుల విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే ఎంతోమంది నటీనటులు విడిపోయారు. కేవలం వెండితెర మాత్రమే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా ఒక్క చిన్న చిన్న మనస్పర్థలకే విడాకులు తీసుకుంటున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా విడాకులకు రెడీ అయింది అంటూ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్..

The star Heroine who is about to get a divorce

విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.ఈమె తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు మూవీలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలలో చేస్తే విద్యా బాలన్ బసవతారకం పాత్రలో అదరగొట్టింది. ఇక విద్యాబాలన్ త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చేసింది ఎవరో కాదు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు..అయితే అందులో అస్సలు నిజం లేకపోయినా కూడా నోటికి వచ్చింది ఏదో ఒకటి రాసుకోస్తూ ఉంటారు ఉమైర్..(Heroine)

Also Read: Heroine Anjali: నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి అవుతుంది.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక ఇప్పటికే ఇలాంటి షాకింగ్ పోస్టులు పెట్టి ఎంతో మందితో విమర్శలకు గురైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఉమైర్ సందు తన సోషల్ మీడియా ఖాతాలో నటి విద్యాబాలన్ తన భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ తో త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని,ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు.దీంతో ఈ పోస్ట్ కి కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది ఈమె అభిమానులు మా హీరోయిన్ నిజంగానే విడాకులు తీసుకుపోతుందా ఏంటి అని టెన్షన్ పడుతున్నారు.

The star Heroine who is about to get a divorce

ఇక రీసెంట్ గా విద్యాబాలన్ నటించిన ధో ఔర్ దో ప్యార్ అనే మూవీ విడుదలైంది.అయితే ఈ సినిమాలో విద్యా బాలన్ రెచ్చిపోయి రొమా** చేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారా ఏంటి అని కొంతమందిని నెటిజన్స్ అనుమాన పడుతున్నారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది మాత్రం ఉమైర్ సందు పెట్టిన పోస్టులో ఏమాత్రం నిజం లేదని, వారిద్దరు విడాకులు తీసుకోవట్లేదని ఆ రూమర్స్ అన్నింటిని కొట్టిపారేస్తున్నారు.(Heroine)

Join WhatsApp