Sr.NTR did the accident to that heroine

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఈయన పేరు వినిపిస్తుంది.. అలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఓ సమయంలో షూటింగ్ ఇష్టం లేక హీరోయిన్ కి యాక్సిడెంట్ చేశాడు అంటూ గతంలో దర్శకేంద్రుడు సౌందర్యలహరి అనే ప్రోగ్రాంలో బయట పెట్టారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు అలా చేశారు… ఏ హీరోయిన్ కి యాక్సిడెంట్ చేశారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Sr.NTR did the accident to that heroine

సౌందర్య లహరి ప్రోగ్రాం లోకి ఎంతోమంది నటీనటులు వచ్చి సినిమా సమయంలో తమకు జరిగిన కొన్ని చెడు,మంచి, ఫన్నీ సంఘటనలను బయటపెట్టేవారు. అయితే అలా ఓ రోజు శ్రీదేవి ఆ ప్రోగ్రాం కి వచ్చిన సమయంలో రాఘవేంద్రరావు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో ఆయన ఏం మాట్లాడారంటే.. సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో ఎప్పుడు కూడా ప్యాకప్ చెప్పేవారు కాదు.డైరెక్టర్ చెప్పేవరకు షూటింగ్లో ఉండేవారు.అయితే ఆయనకు అత్యవసరంగా ఏదైనా పని ఉన్నప్పుడు ప్యాకప్ చెప్పకుండా వెరైటీ వెరైటీ పనులు చేస్తూ ఉండేవారు.(Sr.NTR )

Also Read: Ileana: మానసికంగా అలసిపోయా.. గాఢంగా ప్రేమించే వ్యక్తి కావాలి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్..!

అలా ఓసారి శ్రీదేవి ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమెను నీళ్లలోకి లాగి ఆమె అడ్రస్ తడిసి పోయిందని షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు. అలాగే మరోసారి ఆయనకు ఏదో అర్జెంట్ పని ఉండడం వల్ల ప్యాకప్ చెప్పలేక శ్రీదేవిని కాలువలోకి తోసేసి అయ్యో శ్రీదేవి డ్రెస్ తడిసిపోయింది షూటింగ్ రేపు చేద్దాంలే అని ఇంటికి వెళ్ళిపోయారు. అంతేకాకుండా శ్రీదేవి ఎన్టీఆర్లు చేసిన వేటగాడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి ఏదో వర్క్ ఉన్న సమయంలో షూటింగ్ జరుగుతుంది.

Sr.NTR did the accident to that heroine

ఆ సమయంలో ఆయన ఏం చేయాలో తెలియక జీపులో డ్రైవ్ చేసే సన్నివేశం తెరకెఎక్కించే సమయంలో వేగంగా వచ్చి శ్రీదేవిని గుద్దేశారు. దాంతో శ్రీదేవి కాలికి చిన్నపాటి గాయం వ్వడంతో ఏం కాదు షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని నేను చెప్పినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం అయ్యో పాపం శ్రీదేవికి గాయం అయింది.ప్యాకప్ చెప్పేద్దాం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అంటూ ఎన్టీఆర్ గురించి కొన్ని సీక్రెట్ విషయాలను బయటపెట్టారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇక ఈ విషయాలన్నీ నిజమేనని శ్రీదేవి కూడా ఆ ప్రోగ్రాంలో ఒప్పుకుంది.(Sr.NTR )

Join WhatsApp