Allu Aravind bought an expensive car

Allu Aravind: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ తాజాగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారట. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్స్ ఈ కారును కొన్నది ఆమె కోసమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Allu Aravind bought an expensive car

ఇక అసలు విషయంలోకి వెళ్తే..గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాత అల్లు అరవింద్ సినిమాల్లో ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంటారు. ఆయన ఎప్పుడు ఏదో ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాల్లో బిజీగా ఉంటారు. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో తండేల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.. ( Allu Aravind)

Also Read: Allu Arjun: పుష్ప పుష్ప పుష్ప అంటూ హైప్స్ ని మంట కలిపేసిన మేకర్స్.. ఫైర్ అవుతున్న రవితేజ..!

ఇదంతా పక్కన పెడితే తాజాగా అల్లు అరవింద్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు.ఇక ఈ కారు బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన అజయ్ దేవగణ్ వంటి వాళ్ల దగ్గర ఉంది.ఇక కారు పేరు BMW i7.. ఇక ఈ ఖరీదైన కారు మార్కెట్ విలువ దాదాపు 2.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రికల్ కారు.. అయితే ఈ కారుని తన భార్య కోసం కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది.

 Allu Aravind bought an expensive car

అయితే కంపెనీ వాళ్లు అల్లు అరవింద్ ఇంటికి కారును హోం డెలివరీ చేయగానే తన భార్యను కారులో ఎక్కించుకొని తిరిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అల్లు అరవింద్ తన భార్య కోసమే స్పెషల్ గా ఈ కారుని కొని గిఫ్ట్ గా ఇచ్చారేమో అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.( Allu Aravind)

Join WhatsApp