Blaupunkt Xtreme Earbuds : చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ని కొంటూ ఉంటారు. చాలామంది ఇయర్ బడ్స్ ని కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉంటారు. ఇయర్ బడ్స్ ని ఉపయోగించే వాళ్ళు మంచి నాణ్యమైన వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. మీరు కూడా మంచి ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేయాలని అనుకుంటే కచ్చితంగా వీటి గురించి చూడాల్సిందే. 120 గంటలు ఏకధాటిగా ఈ వీటిని వాడుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

Blaupunkt Xtreme Earbuds full details

ఒక ఛార్జ్‌పై 120 గంటల వరకు అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. నిరంతరాయంగా కాల్స్, మ్యూజిక్, ఇంతర కంటెంట్ ను ఆస్వాదించేందుకు అవుతుంది. బ్లాపన్‌కేటీ ఎక్స్‌ట్రీమ్ ఇయర్‌బడ్‌ల లో భారీ 800ఎంఏహెచ్ బ్యాటరీల ఇచ్చారు. ఇయర్‌బడ్‌లు, ఛార్జింగ్ కేస్ ఎక్కువ కాలం పాటు స్థిరమైన శక్తిని ఇస్తూ ఉంటాయి. అధునాతన చిప్ ఇయర్‌బడ్స్‌లో విలీనం చేశారు. విద్యుత్ వినియోగాన్ని 20 శాతం వరకు తగ్గించేస్తుంది ఇది.

Also read: Ampere Nexus: ఇండియాలో లాంచ్ కాబోతున్న ఆంపియర్ నెక్సస్..!

ఇయర్‌బడ్‌లను నిరంతరం రీఛార్జ్ చేయకుండా రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్‌తో పాటు ఇతర ఫీచర్‌లను కూడా అందిస్తాయి. ఏఐ మైక్‌లు, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ని కూడా ఇచ్చారు. క్రిస్టల్-క్లియర్ ఆడియో నాణ్యతను కూడా కలిగి వున్నాయి. ఛార్జింగ్ కేస్‌ని ఉపయోగించి ఇయర్‌బడ్‌లను 8 సార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం నుండి వీటిని మీరు రూ. 1,699 కి కొనుగోలు చెయ్యవచ్చు. ప్రీమియం మెటీరియల్స్, హై-క్వాలిటీ కాంపోనెంట్‌లను ఉపయోగించి వీటిని తయారు చేసారు (Blaupunkt Xtreme Earbuds).

Join WhatsApp