Did Aamani divorce her husband because

Aamani: సీనియర్ నటి ఆమని అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు కూడా తెలుసు.. ఎందుకంటే ఈమె ఇప్పటి జనరేషన్ హీరోలకు కూడా తల్లి,అత్త వంటి పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. అయితే అలాంటి ఆమని అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక ఆమెకి అప్పట్లో కొంతమంది హీరోలతో ఎఫై** నడిపించినట్లు కూడా వార్తలు వినిపించాయి.

Did Aamani divorce her husband because

ఇక ఉన్నట్టుండి భర్తకు దూరమై సినిమాల్లో యాక్టివ్ అయ్యేసరికి ఆమని భర్తకు విడాకులు ఇచ్చేసి ఆ తెలుగు హీరోతో ఎఫై పెట్టుకుంది అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్గా తన భర్తతో విడాకులపై మొదటిసారి పెదవి విప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆమని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను నా భర్తతో విడాకులు తీసుకున్నాను.(Aamani)

Also Read: Heroine: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..!

అయితే ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నాం కాబట్టి దూరం దూరంగా ఉంటున్నాం. అయితే మా ఇద్దరి మధ్య దూరం అయితే పెరిగింది కానీ విడాకులు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీదే అనుకొని విడిపోయాం. అలాగే నా ఇద్దరు పిల్లలు బాధ్యతలను నేనే తీసుకున్నాను. నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం వాళ్లే నా ప్రాణం. విడాకులు తీసుకున్నప్పటి కూడా మేమిద్దరం స్నేహంగానే మెదులుతాం.

Did Aamani divorce her husband because

అప్పుడప్పుడు కలుసుకుంటాం.అలాగే ఫోన్లు కూడా మాట్లాడుకుంటాం..అంటూ తన విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆమని. ఇక హీరోతో ఎఫై** అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కూడా తేల్చిచెప్పేసింది. ఇక ఆమని కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఖాజా మొహీయుద్దిన్ ని పెళ్లాడింది.వీరికి ఒక పాప,బాబు పుట్టారు. ఇక పిల్లలు పుట్టాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు..(Aamani)

Join WhatsApp