Prabhas is that why you are away from marriage

Prabhas: ప్రభాస్ పేరు చెబితే ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ హిస్టరీలో ఏ హీరో కూడా లేని పొజిషన్లో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే అందరికీ తెలుసు. అయితే అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ కి కాలేజీ రోజుల్లో చదువుతున్న సమయంలో అమ్మాయిల దగ్గర ఒక వింత అనుభవం ఏర్పడిందట. మరి ప్రభాస్ కి ఏర్పడిన ఆ అనుభవం వల్లే ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదా..వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Prabhas is that why you are away from marriage

చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను తమ సినిమా ప్రమోషన్స్ టైం లో బయట పెడుతూ ఉంటారు.అయితే ప్రభాస్ కూడా తన ప్రేమ లవ్ ఫెయిల్యూర్ గురించి ఓ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో బయటపెట్టారు.ఇక ప్రభాస్ ఆయన లవ్ గురించి ఏం చెప్పారంటే.. ప్రభాస్ బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా అందరూ చూసే ఉంటారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే. (Prabhas)

Also Read: Prabhas-NTR: ప్రభాస్ ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టించిన స్టార్ డైరెక్టర్..?

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ప్రభాస్ మాట్లాడుతూ.. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో కొంతమంది అమ్మాయిలపై ప్రేమ పెంచుకొని వారికి ప్రపోజ్ చేసినప్పటికీ నేను నచ్చక వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటూ ఎవరికి తెలియని ఒక విషయాన్ని చెప్పారు. ఇక ఈ విషయం విన్న యాంకర్ మరి సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్లతో కూడా మీరు ప్రేమలో పడలేదా అని అడిగింది.దానికి ప్రభాస్ ఇప్పటి వరకు అలాంటిది అయితే ఏమీ జరగలేదు అంటూ చెప్పేశారు. ఇక మీరు సెలబ్రిటీ ఇప్పుడు..

Prabhas is that why you are away from marriage

మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేస్తారు అని చెప్పగా అలాంటిదేమీ లేదు ఇప్పటికీ ఆ విషయంలో నార్మలే ఉంటా అంటూ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనూ కూడా ప్రస్తుతం లవ్ లో లేనని చెప్పారు. అయితే అప్పటి వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియో చూసి ప్రభాస్ ని నిజంగానే కాలేజీ లో చదువుకునే రోజుల్లో అమ్మాయిలు రిజెక్ట్ చేశారా.. ఇక ప్రభాస్ ని రిజెక్ట్ చేసిన అమ్మాయిలు ఇప్పుడు ఎంతగా బాధపడుతున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)

Join WhatsApp